ఘట్కేసర్, వెలుగు: వాహనం ఢీకొని ఘట్కేసర్పరిధిలో ఒకరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా వీగం గ్రామానికి చెందిన గట్టు సాయి ఇంద్రనీల్ గౌడ్(31) ఘట్కేసర్ సమీపంలోని ఔషాపూర్ తీన్మార్ హోటల్లో పనిచేస్తున్నాడు. బైక్పై సోమవారం ఉదయం పనికి వెళ్తుండగా, ఎన్ఎఫ్సీ నగర్ పెట్రోల్ బంకు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో సాయి ఇంద్రనీల్గౌడ్తలకు తీవ్ర గాయం కావడంతో స్పాట్లోనే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరుశురామ్ తెలిపారు.